Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్
మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 36, 37, 38, 39, 42, 45, 49, 50, 143, 144 సర్వే నెంబర్లు ఉమ్మడి ఆస్తి ఉన్నట్టు, ఆస్తికి సంబంధించి 15 ఎకరాలకు నలుగురు వారసులు అందరికీ సమానంగా పంచుకోమని మోసం చేసిన కౌన్సిలర్ జిట్ట వేణుగోపాల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు గురువారం భువనగిరి ఏసీపీి, ఆర్డీవో, రూరల్ ఎస్ఐ సైదులుకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో జీట్ట బాలకష్ణ రెడ్డి, జిట్టా పరమేశ్వర్ రెడ్డి, జిట్ట బలవంత రెడ్డి, భరత్ రెడ్డి ఉన్నారు.