Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
హనుమాన్‌పేటలో నూతన మద్యం దుకాణం రవి వైన్స్ పేరుతో ఏర్పాటు చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ ఆ కాలనీవాసులు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహి ంచారు.బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చిలుకూరి శ్యామ్, హనుమాన్‌పేట ప్రజలు పెట్రోల్ పోసుకుని ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇదే వార్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర ఒక వైన్స్ నడుస్తుందన్నారు.దీని పరిధిలో కేవలం 2100 జనాభా ఉందన్నారు.ప్రభుత్వ గెజిట్ ప్రకారం ఐదు వేల మందికి ఒకటి చొప్పున ఇచ్చారని, దానిని అతిక్రమించి హనుమాన్‌పేట ప్రజలకు, మహిళలకు, సాయిబాబా గుడికి వెళ్లే భక్తులకు చాలా ఇబ్బందికి గురవు తున్నారన్నారు. గతంలో ఆక్సిడెంట్లు చాలా జరిగాయని, పార్కింగ్ లేక సాగర్ రోడ్‌పై ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రెండ్రోజుల కింద వార్డు కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి, వార్డు సభ్యుల సంతకాల తో ఎక్సైజ్ సీఐకి వినతిపత్రం అందజేశారు.కానీ స్పందనలేదన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బంటుగిరి, పరంగి శ్యామ్, మంద శివ, ప్రసాద్, స్వామి, ఉమాశంకర్, దశరథ పాల్గొన్నారు.