Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడలో ఎన్సీసీలో చేరే విద్యార్థిని,విద్యార్ధుల కోసం ఎంపిక ప్రక్రియను బీఎం హెచ్.బచ్చన్సింగ్, హవల్దార్ తాజోద్దీన్, కేర్‌టేకర్ కె.కార్తీక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థిని, విద్యార్ధులకు సైనిక శిక్షణ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో సేవల నిమిత్తం సిద్దంగా ఉంచడం ఎన్సీసీ ప్రధానలక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ, అధ్యాపక, అధ్యాపకేతర బందం పాల్గొన్నారు.