Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
ఉద్యోగ నియామకాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైయాయని డీివైఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ పేర్కొన్నారు.ఆ సంఘం కేతెపల్లి మండల జనరల్ బాడీ సమావేశం శుక్రవారం స్థానిక అమరవీరులభవన్లో నిర్వహించారు. మండలకమిటీి సభ్యులు నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంకి ముఖ్యఅతిథిగా మహేష్ మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని,అమరుడు శ్రీకాంతాచారి లాంటి అనేక మంది అమరవీరుల ప్రాణత్యాగం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక,నిరుద్యోగులు ఇప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ఈ ప్రభుత్వానికి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచన లేదన్నారు.ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.ఈ నిరంకుశ ప్రభుత్వ విధానాల వల్ల అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఖాళీగా ఉన్న ఉద్యోగులన్నంటిని భర్తీ చేయకుంటే తమ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించి ఈ ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగ భతి చెల్లించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు గద్దపాటి సుధాకర్,వీరేశ్,జనకిరాములు, రవితేజ నాగరాజు,మినేందర్, రాజు,బాలరాజు,సతీష్,అరుణ్, దోసలి సతీష్, పవన్, రవి, వెంకటేష్, రమేష్, మధు పాల్గొన్నారు.