Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర అధ్యక్షుడు మురళీకష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రియల్ ఎస్టేట్‌కు, భవన నిర్మాణానికి, ప్రజలకు భరోసా క్రెడారు అని రాష్ట్ర అధ్యక్షుడు మురళీకష్ణారెడ్డి అన్నారు.కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నల్గొండ శాఖ ఆవిర్భావ కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని మనోరమ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నల్గొండలో కాలుమోపడానికి రంగం సిద్ధం చేస్తున్నాయన్నారు.ఇది నల్గొండ రియల్ఎస్టేట్ రంగాన్ని ఒక ఊపు ఊపుతుందని నిర్మాణరంగ నిపుణులు భావిస్తున్నారని అన్నారు.ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్, భవననిర్మాణ రంగానికి దిక్సూచిగా భావించే ప్రతిష్టాత్మక సంస్థ..క్రెడారు సంస్థ శాఖ నల్గొండలో ఏర్పాటు కావడం రియల్ఎస్టేట్ రంగానికి మరింత తోడ్పాటు ఇస్తుందని భావిస్తున్నామన్నారు.అనంతరం క్రెడామ్ జిల్లా నూతన అధ్యక్షుడిగా బండారు ప్రసాద్,ఉపాధ్యక్షులుగా కోలన్ రాజేందర్‌రెడ్డి,ఏచూరి భాస్కర్,దూదిపాల వెంకట్‌రెడ్డి,నాంపల్లి మనోహర్, ప్రధానకార్యదర్శిగా బాలాజీనాయక్, జాయింట్ సెక్రెటరీలుగా గంజిరమేష్, గట్టువెంకన్న,ఏదుళ్ల శ్రీధర్‌రెడ్డి, ఆమంచి రాజలింగం,కోశాధికారిగా మందడి వెంకట్‌రెడ్డి, కార్యవర్గసభ్యులుగా జల్లా భిక్షం, బొడ్డుపల్లి సతీశ్,కొండూరి శంకర్,రేగట్టె నవీన ్రెడ్డి,ఊశయ్య,మందడి దామోదర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మహేందర్ కందుకూరి ఎన్నికయ్యారు. నూతనంగా నల్గొండ అధ్యక్షునిగా ఎన్నికైన బండారు ప్రసాద్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్య క్రమంలో క్రెడారు రాష్ట్ర చైర్మెన్ రామ చంద్రారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాండు రంగారెడ్డి, కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, అజరు, ప్రేమ్‌సాగర్ పాల్గొన్నారు.