Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరువర్గాలు రాళ్లతో దాడులు
ననవతెలంగాణ-కోదాడరూరల్
మండలపరిధిలోని కాపుగల్లు గ్రామశివారులో 292 సర్వే నెంబర్ ఐదెకరాలలో మెగా పల్లె ప్రకతివనం కోసం కేటాయించిన గుట్టను చదును చేసి మట్టిని లారీల సహాయంతో పట్టణపరిధిలోని వెంచర్లకు విక్రయిస్తున్న మట్టి తరలింపును గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. మట్టి తరలింపును అడ్డుకోవడంతో మట్టి మాఫియా వ్యక్తులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.ఆర్ఐ కళ్యాణి సంఘటన స్థలానికి చేరుకొని మెగా పల్లె ప్రకతి వనం కోసం ఐదెకరాలు కేటాయించారని, కానీ మట్టిని అమ్ముకునే అధికారం లేదని తేల్చి చెప్పారు.గ్రామస్తులు లారీలో ఉన్న మట్టిని అన్లోడ్ చేయించి లారీని సీజ్ చేయాల్సిందిగా కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.అంతేకాకుండా ఎన్ఎస్పీ కాలువల గునలు వేసి మట్టిని తరలించి విక్రయిస్తున్నారని. పర్మిషన్ లేకుండా మట్టిని ఎలా అనుకుంటారని గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలు ఆపాలని కోరారు. దీనిపై సర్పంచ్ కాసాని శ్రీనివాస్ ని వివరణ అడుగగా మెగా పల్లె ప్రకతి వనానికి గ్రామపంచాయతీ పర్మిషన్ ఐదెకరాల ఇచ్చామని గుట్టలుగుట్టలుగా ఉండడంతో దానిని చదును చేసి ఇవ్వాలని తెలిపారు.దీంతో ఇరు వర్గాలు కోదాడ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.