Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి జగదీష్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు అడ్డా అని చెప్పుకున్న రోజులనుండి నేడు నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అడ్డా అనే స్థాయికి తీసుకొచ్చామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని కాశీనాథ్ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షత న నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సమస్యలను నిర్వీర్యం చేసింది కాంగ్రెస్, బీజేపీలేనన్నారు.నిర్వీర్యం చేయడం కోసం చట్టాలు తెచ్చింది చట్టాలకు తూట్లు పొడిచింది ఆ పార్టీలేనన్నారు.130 కోట్ల జనాభాను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వనికి ఉందన్నారు. ఎగుమతి,దిగుమతిలో కేంద్రమే అన్ని బాధ్యతలు వహించాలని రాజ్యాంగంలో ఉన్నదన్నారు.రైతులను కేసీఆర్ నుండి దూరం చేయడానికి వెన్నెముక లేని కాంగ్రెస్, కుట్రపూరిత బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని ఎద్దేవా చేశారు.స్థానిక సమస్యలు నిర్వీర్యం చేసింది ఆ పార్టీలేని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్రం రైతులకు విద్యుత్, రైతుబంధు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని మీరు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థికి తిరుగే లేదన్నారు.కోటిరెడ్డి రికార్డు మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణిపుల్లారెడ్డి, నియోజకవర్గ రైతు సమన్వయ కమిటీ అధ్యక్ష్నులు సుంకర అజరుకుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లలు, టీిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.