Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండిపెండెంట్ అభ్యర్థి కె.నగేష్
నల్లగొండ :స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మగౌరవానికి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్, రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం, తెలంగాణ రాష్ట్ర కౌన్సిలర్ల సంఘం బలపరిచిన ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ అన్నారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిధులు కేటాయించకుండా,కేటాయించిన నిధులను విడుదల చేయకుండా స్థానికసంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో అనేక గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అప్పులు చేసి సొంత డబ్బులు పెట్టి కేటాయించిన అరకొర అభివద్ధి పనులు చేస్తే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంమూలంగా ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారన్నారు.అధికారిక కార్యక్రమాలలో జెడ్పీటీసీలకు,ఎంపీటీసీలకు సరైన గౌరవం లభించడం లేదని మండిపడ్డారు.తమకు న్యాయం చేయాలంటూ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పలుమార్లు సీఎం కేసీఆర్‌కు విన్నవించుకున్నా స్పందన లేదన్నారు.గతంలో గెలిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో తప్ప మరెన్నడూ కనబడ లేదన్నారు.ఏ రోజు కూడా శాసనమండలిలో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు సమస్యలపై చర్చ లేవనెత్తలేదన్నారు. ప్రభుత్వం 2019లో మున్సిపల్ చట్టం తెచ్చి కౌన్సిలర్లకు ఎలాంటి విధులు, నిధులు గౌరవం లేకుండా అలాగే కౌన్సిలర్ల చేసిన అధికారులు మాత్రం కలెక్టర్‌కు ఇచ్చి కౌన్సిలర్ ,చైర్మన్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తనకు బ్యాలెట్ పేపర్‌పై నాలుగో నెంబర్ పక్కన మొదటి ప్రాధాన్యతా ఓటేసి గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బోయకృష్ణయ్య, యాస కర్నాకర్, శ్రీనివాస్, యాదగిరి, సురేష్, ప్రభాకర్, రవీందర్, యాదాద్రి జిల్లా ఎంపీపీల కన్వీనర్ రమేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు కల్పన పాల్గొన్నారు.