Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీగా పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కెఎల్ఎన్ ప్రసాద్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మా అధ్యక్షుడు మంచువిష్ణు, తెలంగాణ సిని మాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన కార్యక్రమంలో తెలంగాణ ఫిలీం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకష్ణగౌడ్ అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణస్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిస్ట్‌ల కోసం అసోసియేషన్ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షులు ప్రతాని రామకష్ణగౌడ్ నాయకత్వంలో ఏ పిలుపునిచ్చిన ముందుంటామని తెలిపారు.రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెెటరీ గా ఎన్నికైనందుకు పార్టీ నాయకులు న్యాయవాదమిత్రులు సంఘాల నాయకులు ఆయన్ను అభినందించారు.