Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ జీవన్ప్రశాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ అధికార పార్టీ టీఆర్ఎస్ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతిపై కలెక్టర్ జీవన్ప్రశాంత్ పాటిల్ గురువారం రాత్రి సస్పెన్షన్ వేటు వేశారు. నార్కట్‌పల్లి, గ్రామ పంచాయతీ అభివద్ధిలో భాగంగా చేసిన పనులలో కొన్నిపనులకు ఖర్చులు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారని గ్రామ ఉపసర్పంచ్ స్వామి వార్డు సభ్యులు ఫిర్యాదు మేరకు జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ సంయుక్తంగా విచారణ జరిపారు .ఈ విచారణలో రూ.16,85,668 నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినందున తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నోటీస్ జారీ చేశారన్నారు.అదే క్రమంలో చెక్‌పవర్‌ను రద్దు చేస్తూ ఎంపీడీవోకు ఆ బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్ స్రవంతి నిబంధనలకువిరుద్ధంగా ఖర్చు చేసిన రూ.16,85,668లకుగాను వారు సమర్పించిన సంబాయి పిలో రూ1,94429లకు మాత్రమే తగినఆధారాలు (బిల్లులు, తీర్మాణాలు సమర్పించారు.మిగతా రూ.14,91,239లకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు.దీంతో ఆమెను తెలంగాణ పంచాయతీరాజ్చట్టం 2018లోని సి.15 37 (5) ప్రకారం వెంటనే సర్పంచ్ పదవి నుండి తాత్కాలికంగా (6) నెలల పాటు తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.ఉపసర్పంచ్ వార్డు సభ్యులు ఫిర్యాదులో గ్రామ పంచాయతీ, నార్కట్‌పల్లి గ్రామ సర్పంచ్ భర్త షాడో సర్పంచ్‌గా చెలామణి అవుతూ అవినీతికి పాల్పడుతున్నారని, దొంగ బిల్లులు పెట్టి డబ్బులు కాచేస్తున్నారని, 10 రోజుల ప్రణాళికలో ఒక్క పని చేయలేదని, పల్లె ప్రకతివనం పనులలో అవినీతికి పాల్పడ్డారని, వర్కర్లకు నాణ్యత లేని బట్టలు ఇచ్చారని, వారి క్లీనింగ్ విషయంలో అవినీతికి పాల్పడ్డారని, మొక్కలు, టీగార్డులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువమొత్తంలో డబ్బులు డ్రా చేసినారని, ఫిర్యాదులో పేర్కొన్నారు.కలెక్టర్ తదుపరి ఉత్తర్వులు వెలువడింతవరకు పూర్తిగా నిషేధిస్తూ ఆ సమయంలో గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌కు,నార్కట్‌పల్లి, మండల పరిషత్ అభివద్ధిఅధికారికి చెక్కు డ్రా చేయు అధికారం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరణ
ఇన్చార్జి సర్పంచ్‌గా ఉపసర్పంచ్ సిర్పంగి స్వామి
నార్కట్‌పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఇన్చార్జి సర్పంచ్‌గా ఉపసర్పంచ్ స్వామితో ఎంపీడీవో యాదగిరిగౌడ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సత్య నారాయణ, వార్డు సభ్యులు అజీజ్, శ్రీనివాస్ రాజశేఖర్‌రెడ్డి, అర్థం శ్రీనివాస్ పాల్గొన్నారు.