Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలోని నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, పోటీ పరీక్షల నిపుణులు మోదాల మల్లేష్‌కు జంతు శాస్త్ర విభాగంలో చేసిన పరిశోధనకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను శుక్రవారం ప్రకటించింది.ఈయన కాకతీయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్రవిభాగం సహాయ ఆచార్యురాలు డాక్టర్ చింత స్రవంతి పర్యవేక్షణలో 'సీజనల్ డైవర్సిటీ ఆఫ్ పెస్ట్స్ అండ్ ప్రిడేటర్స్ ఇన్బీటీ అండ్ నాన్‌బీటీ కాటన్ ఫీల్డ్ఆఫ్ నల్లగొండ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్' అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది.ఈయన తన పరిశోధనకాలంలో వివిధ జాతీయ అంతర్జాతీయ జర్నల్స్‌లో ఐదు పరిశోధనా వ్యాసాలను ప్రచురించాడు.ఈయన యొక్క పరిశోధన పత్తి రైతులకు, పెస్టిసైడ్ కంపెనీలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈయన 2009 సంవత్సరం నుండి పీజీ ప్రవేశపరీక్షలకు (జంతుశాస్త్రం) ఉచిత కోచింగ్ ఇస్తున్నారు.ఈయన శిక్షణలో చాలామంది విద్యార్థులు ఉత్తమర్యాంకులు సాధించి వివిధ యూనివర్సిటీలలో పీజీ అడ్మిషన్లు పొందారు.ఈయన కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్‌వన్,గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్, ఫోర్లాంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం వివిధ దినపత్రికలలో వందలాది విద్యా సంబంధిత ఆర్టికల్స్ వ్రాసారు.ఈయన బీఈడీ, పీజీ డిగ్రీలను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సీ.పీ.ఎఫ్.ఎన్.ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి పొందారు.ఈయన మన గతం లో నకిరేకల్ లోని అరుణోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నల్లగొండలోని నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, సూర్యా పేటలోని కవిత జూనియర్ కళాశాల యందు జంతుశాస్త్ర అధ్యాపకులుగా పనిచేశారు. ప్రస్తుతం నకిరేకల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్(గెస్ట్)గా విధులు నిర్వహిస్తున్నారు.ఈయనకు డాక్టరేట్ రావడం పట్ల కుటుంబసభ్యులు, మిత్రులు, కళాశాల సిబ్బంది, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.