Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టాలను పునరుద్ధరించకపోతే నిరవధిక సమ్మె తప్పదు
యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ
నాలుగు లేబర్కోడ్లను రద్దుచేసి 1996 నిర్మాణ కార్మికుల సంక్షేమ కేంద్ర చట్టం,1979 వలస కార్మికుల చట్టాలతో పాటు 29 కార్మికచట్టాలను పునరుద్ధరించకపోతే నిర్మాణరంగ కార్మికుల కాక మొత్తం కార్మికవర్గ ఆగ్రహానికి మోడీ ప్రభుత్వం గురికాక తప్పదని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు రెండోరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నల్గొండ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించారు.అనంతరం డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజేంద్రప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులశ్రమను మరింత దోచుకోవడానికి పెట్టుబడిదారుల లాభాల గ్యారంటీ కోసమే కార్మికచట్టాలను రద్దు చేసి కార్మికవర్గానికి ఏ హక్కులేని ఆధునిక బానిసలుగా మార్చాలని చూస్తున్నారన్నారు.ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఐక్య సమరశీలపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులు అనేక పోరాటాలు చేసి 1996 నిర్మాణ కార్మికుల సంక్షేమచట్టం,1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాలు సాధించుకున్నారన్నారు.ఆ చట్టాల వెలుగులోనే 1998 సెస్సు చట్టం,రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డు ఏర్పడి పని ప్రమాదమరణం, సహజమరణం, పెండ్ల్లి కానుక, ప్రసూతి సదుపాయాలు, అడ్డా ప్రదేశాల్లో మౌలికసౌకర్యాలు వంటి అనేక సంక్షేమ పథకాలు కార్మికులకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయన్నారు. 1996 చట్టం రద్దయితే ఈ సంక్షేమ చర్యలు అన్ని రద్దు అవుతాయన్నారు. వీటిని కాపాడుకోవడానికి అవసరమైతే మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు.యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నర్సింహమాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్లయిమ్స్‌ను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కరోనాకాలంలో ల్యాబ్ సైనాకార్డులను రెన్యువల్ చేయాలని కోరారు.నిర్మాణకార్మికుల హక్కులకోసం జరిగే పోరాటాల్లో నిర్మాణరంగ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, యూనియన్ జిల్లానాయకులు డి.వెంకట్‌రెడ్డి, సాగర్ల మల్లయ్య, బి.గురువయ్య, పెయింటర్ అధ్యక్షులు గుండె రమేష్, బైరు నర్సింహ,గుంజ నర్సింహ, గుంజపెద్దరాములు, వల్లపుజాని, బుర్సు కోటేశ్వర్, శంకర్, జె.సత్య నారాయణ, సలివోజు సైదాచారి, చరణ్, బి.సైదులు, డి.ఎల్లయ్య, పాక లింగయ్య పాల్గొన్నారు.