Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
మున్సిపల్కార్మికులకు 11వ పీఆర్సీలో పెరిగిన వేతనాలివ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీమ్, జిల్లా సహాయకార్యదర్శి దండెంపల్లిసత్తయ్య డిమాండ్ చేశారు.ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ నెల నుండే పెరిగిన వేతనాలను కేటగిరి వారిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు.వేతనాల పెంపు కోసం మున్సిపల్ కార్మికులు పెరిగిన వేతనాలకోసం అనేక రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు, ఛలోహైదరాబాద్ లు నిర్వహించిన ప్రభుత్వంలో చలనం లేదని ఎద్దేవా చేశారు.వరంగల్, జమ్మికుంటలో పెరిగిన వేతనాలు అక్కడి కార్మికులకు ఇస్తున్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఉన్న మున్సిపల్ కార్మికుల కు ఇవ్వడానికి వస్తున్న ఆటంకాలు ఏంటో చైర్మెన్లు కమిషనర్లకు సమాధానం చెప్పాలని కోరారు.కార్మికుల శ్రమతో మున్సిపాలిటీలకు అవార్డులు, నిధులు వస్తున్నప్పటికీ కార్మికులను మాత్రం లెక్కచేయడం లేదన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన సబ్బులు, బట్టలు, చెప్పులు ఇతరసామగ్రి ఏం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వేతనాల పెంపుకోసం పెరిగినవేతనాలు, ఇతర సమస్యల పరిష్కరం కోసం అవసరమైతే నిరవధిక సమ్మెకు పోతామనిహెచ్చరించారు.11వ పీఆర్సీలో త్రిసభ్య కమిటీచైర్మన్ సూచించిన వేతనాలను రూ.19 వేలు, రూ.22,900,31040 అమలు చేయాలని కోరారు.పెరిగిన వేతనాలు ఇవ్వకపోగా జీఓ నెంబర్ 60ని విడుదల చేసి 30శాతం వేతనాలు తగ్గిస్తూ రూ.15,600, 19,500, 22,750 నిర్ణయించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.జీఓ నెం:60ని సవరించాలని ఆ లోపు జీఓ :60లో పేర్కొన్న వేతనాలు కేటగిరిల వారీగా ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలరవికుమార్, నల్లగొండ పట్టణ నాయకులు పెరిక కష్ణ, దాసారపు రమేష్, సంజీవ, అంజమ్మ, ఎల్లమ్మ, లింగయ్య, కష్ణవేణి,నాగుల కరుణ,భిక్షం పాల్గొన్నారు.