Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాసంగి విద్యుత్,నీటివిడుదలపై స్పష్టమైన ప్రకటన చేయించాలి
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఎమ్మెల్యే గారు అన్నిరకాల ధాన్యం అమ్మించే బాధ్యత తీసుకోవాలని, యాసంగిలో నీటిపై, విద్యుత్‌పై స్పష్టమైన ప్రకటన చేయించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.యాసంగిలో వరిపంట సాగు చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు హామీ ఇచ్చారన్నారు.కేవలం సన్నరకం ధాన్యం మాత్రమే అమ్మించే బాధ్యత తీసుకోవడం సరికాదని, అన్నిరకాల ధాన్యం, సన్నరకాలు 1010, 1001 దొడ్డు వడ్లు, ఆర్ఎన్ఆర్, బతుకమ్మ వంటి రకం ధాన్యం మద్దతుధరకు అమ్మించే బాధ్యత తీసుకోవాలని, దీనిపై స్పష్టమైన ప్రకటన చేసి రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కరెంట్‌కోతలు లేకుండా, నిరంతరం విద్యుత్పొలాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రస్తుతం ధాన్యం ధరలను మిల్లర్లు పెంచి కొనుగోలు చేస్తున్నారని, గతంలో మద్దతుధరకు రూ.200, రూ.400 తక్కువకు కొనుగోలుచేశారన్నారు.నువ్వు చెప్పిన ప్రకారం ఎవరికి కూడా రూ.1850 ధర ఇవ్వలేదని గుర్తుచేశారు.రైతుల వద్ద ధాన్యం దాదాపు పూర్తయ్యాక ఇప్పుడు మద్దతుధరకు అదనంగా రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పెంచి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారన్నారు.దీని వెనక ఆంతర్యమేమిటి చెప్పాలని డిమాండ్ చేశారు.తక్కువధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోయి బిల్లులు తీసుకోని రైతులకు కనీసమద్దతు ధర ఇప్పించి ఆదుకోవాలని కోరారు.యాసంగిలో వరిపంట సాగుకు వెంటనే విద్యుత్, నీరు ఎడమకాలువకు విడుదల చేసేలా ప్రకటన ముఖ్యమంత్రి లేదా సంబంధితమంత్రితో చేయించాలని డిమాండ్ చేశారు.ఎడమకాలువకు ఏప్రిల్ 30 వరకు నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రకటన చేయించాలని కోరారు.అప్పుడే రైతులకు మీ ప్రకటనపై నమ్మకం వస్తుందని, లేకపోతే రైతులు అయోమయంలో ఉంటారని తెలిపారు.