Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధాన్యం కొనుగోళ్లకేంద్రాల పరిశీలన
డీఎం నాగేశ్వర్రావు
నవతెలంగాణ-నిడమనూరు
రైతులు తీసుకొస్తున్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు వేగవంతంగా కొనుగోలు చేపట్టాలని సివిల్ సప్లై డీఎం నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం మండలకేంద్రంలోని వ్యవసాయమార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా మార్కెటింగ్ ఐకేపీ ఆధ్వర్యంలో 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 24వేల మంది రైతుల ద్వారా లక్షా90వేల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.ఇప్పటివరకు రూ.120 కోట్ల రూపాయలను చెల్లించినట్లు పేర్కొన్నారు.రైతులు ఓటీపీ ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలని ఓటీపీ సౌకర్యం లేని రైతులు పోస్టాఫీసులో తమ అకౌంట్ నెంబర్‌కు సెల్‌నెంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు.సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు అగ్రికల్చర్ అధికారులను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.కొనుగోలు సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని నిర్వాహలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డీిఎస్ఓ వెంకటేశ్వర్లు,డీఎంఓ శ్రీకాంత్,ఏఎస్ఓ నిత్యానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ కామర్ల జానయ్య, మిల్లర్స్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, మార్కెట్ సెక్రటరీ వేణు , రైతులు పాల్గొన్నారు.