Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరి రూరల్
తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో భాగంగా 2022-23, 2023-24 సంవత్సరాల్లో మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీ, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికను రెండు, మూడు రోజుల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కల పెంపకం చేపట్టాలని, అవెన్యూ ప్లాంటేషన్‌లో పెద్ద మొక్కలతో సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, జిల్లా ఎక్సైజ్ అధికారి కృష్ణప్రియ, జిల్లా ఉద్యానవన అధికారి, జిల్లా రోడ్లు భవనాల అధికారి, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.