Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు పాశికంటి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్ ఆడెపు బాలస్వామి , మాజీ ఇన్చార్జి సర్పంచ్ దాసి సంతోష్, పార్టీ ఆర్గనైసింగ్ సెక్రెటరీ కూతాటి అంజన్ కుమార్, 8వ వార్డు అధ్యక్షుడు నారాయణ సిద్దులు, వార్డు నాయకులు కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.