Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరేళ్ల విటలచార్యకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 గాను విశిష్ట సేవా పురస్కారం ఈ నెల 12 న తెలుగు వర్సిటీ వారు ప్రదానం చేస్తున్న విశిష్ఠ పురస్కారం ఉప ప్రధాని వెంకయ్య నాయుడు చేతులమీదుగా పొందనున్న సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ కమిటీి సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు . ఉపాధ్యాయుడుగా, కవిగా, సాహితీ వేత్తగా ఎంతో అభివద్ధి చేశారని దేవాలయ వ్యవస్థాపకులు పెందోట సోమయ్య పేర్కొన్నారు. తన ఇంటినే గ్రంథాలయంగా నిర్మాణం చేసి సుమారు రెండు లక్షల పుస్తకాలు సేకరించి నిర్వాహన గావిసున్నారని తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో దేవాలయ ధరకర్త అద్దంకి కష్ణమాచారి, దాసోజు గ్యాణేశ్వర్, చోల్లేటి శ్రీనివాస్, చోల్లేటి బ్రహ్మచారి, గుంటాజూ రమేష్, గడగోజు సత్యనారాయణ, చొక్కళ్ళ పుష్పగిరి ఉన్నారు