Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
భూమిని నమ్ముకున్న వారికి నష్టం వాటిల్లదని జెవి బిల్డర్ అధినేత వేలూరి లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని చిన్నకాపర్తి శివారులో ఏర్పాటుచేసిన ఫార్మ్ ల్యాండ్ వెంచర్‌ను ఆదివారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని నమ్మి పెట్టుబడి పెట్టిన వారు నష్టపోయిన సందర్భాన్నిచూడలేదన్నారు. తమ వెంచర్ లో భూమిని కొనుగోలు చేసిన వారికి అగర్ వుడ్ చెట్లను సేంద్రియ ఎరువుల ద్వారా పెంచనున్నట్టు తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా నిపుణుల పర్యవేక్షణలో సేద్యం చేయడం జరుగుతుందన్నారు. కేవలం 8 నుండి 10 సంవత్సరాలలో అధిక దిగుబడి పొందే అవకాశం ఉందన్నారు. బిందుసేద్యం ద్వారా అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అగర్ వుడ్ చెట్లను పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్ చైర్మెన్‌్ జ్యోతి, డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, సహాయకులు పెందోట గణేష్ తదితరులు పాల్గొన్నారు.