Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చండూరు :మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పశువైద్య ఉప కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ గ్రామ ఉప సర్పంచ్ కాసాల వెంకట్ రెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చామల పల్లి, చొప్పరి వారి గూడెం, లకినేని గూడెం అదేవిధంగా తుమ్మల పల్లి గ్రామాలకు మధ్య సెంటర్లో గుండ్రపల్లి గ్రామం వున్నందున గ్రామాల్లోని పశు గణణ ఆధారంగా రైతులకు జరిగే మేలును దష్టిలో ఉంచుకుని పశువైద్య ఉప కేంద్రం ఏర్పాటు పై దష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండ్రపల్లి, తుమ్మల పల్లి గ్రామాల రైతులు పిట్ట రఘుమా రెడ్డి, మహేష్, అంజయ్య, సత్తయ్య లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.