Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందర్నీ ఆందోళనపరుస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాంబశివరావు కోరారు. ఆదివారం నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత వ్యాక్సిన్ పంపిణీ 97 శాతం పూర్తయ్యిందన్నారు .100శాతానికి డిసెంబర్ 31 తేదీలోపు పూర్తి చేస్తామని చెప్పారు. రెండో విడత వ్యాక్సిన్ వేసుకునేవారు, తేదీలవారీగా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు.ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులు హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రజలు గుంపులుగా తిరగవద్దని ప్రభుత్వ నిబంధనలు పాటించాలని చెప్పారు .తప్పనిసరి అయితేనే ఇండ్ల నుంచి బయటికి వెళ్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు . పాఠశాల, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలుసామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని తెలిపారు .