Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నకిరేకల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం రైతులను బలి చేసే విధానాలను అనుసరించడం సరికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల అన్నారు. ఆదివారం పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో నిర్వహించిన ఆ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తత సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నేడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయన్నారు. రెండు ప్రభుత్వాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటు న్నాయన్నారు. ఇరు ప్రభుత్వాలకు కూడా రైతుల పట్ల వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులకు మేలు చేసే విధంగా వ్యవహరించాలే తప్ప వారిని ఇబ్బందులపాలు చేయొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నగేష్, బోజ్జా చిన్న వెంకులు, అవిషెట్టి శంకరయ్య, మరోజు చంద్ర మౌళి, జిట్ట సరోజ, మళ్ళం మహేష్, మండల కార్యదర్శులు ఆరూరి శ్రీను, చెరుకు పెద్దు లు, చింతపల్లి లూర్ధ్ధు మరయ్యా, చెలకాని మల్లయ్య, వంటెపాక వెంకటేశ్వర్లు, సీహెచ్. నాగమణి, శశికళ, మర్రి వెంకటయ్య, ఆది మల్ల సుధీర్ పాల్గొన్నారు.