Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
వరికి బదులు యాసంగిలో ప్రత్యమ్నాయ పంటలు పండించాలని వ్యవసాయాధికారి ఉమారాణి కోరారు. ఆదివారం మండలంలోని గుడిమల్కాపురం గ్రామంలో రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు మినుములు, వేరుశెనగ, శనగలు తదితర పంటల సాగుకు రైతుల ఆసక్తి చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె పుష్పలత చిత్రసేన రెడ్డి, ఏఈఓ శివ, రైతులు పాల్గొన్నారు.