Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలనాక్ ద్వారా బి గ్రేడ్ని పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో శనివారం రాత్రి వైస్రారు హోటల్లో ఇండ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెస్టివల్ ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ అవార్డ్‌ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ , రాష్ట్ర ఉన్నత మండలి చైర్మెన్ లింబాద్రి చేతుల మీదుగా ప్రిన్సిపల్ సిహెచ్.సత్యనారాయణ అందు కున్నారు. ప్రిన్సిపాల్‌కు సిబ్బంది, విద్యార్థులు పలువురు ప్రముఖులు అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎం.రాజు,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జయపాల్, డి.కిషన్, సిబ్బంది రేవతి, వెంకటేశం, హరిత, విద్యాసాగర్ బోధనేతర సిబ్బంది ఫియాజ్, రమేష్, శ్రీనివాస్, ప్రవీణ్, ఉపేంద్ర పాల్గొన్నారు.