Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విజ్ఞాన కేంద్రం చేస్తున్న సేవలు అభినందనీయం
అ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
క్రీడలు శారీరక దఢత్వానిక,ి మానసిక వికాసానికి దోహదపడతాయని నల్లగొండ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లు వెంకటనర్సింహారెడ్డి 17వ వర్థంతి సందర్భంగా ఆదివారం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించే క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెటిల్ బ్యాడ్మెంటన్ ఆట శారీరక శరీర అన్ని అవయవాలు కదిలి విధంగా ఉంటుందన్నారు. క్రీడల ద్వారా రోజురోజుకు మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చన్నారు. విజ్ఞాన కేంద్రం కోవిడ్ కాలంలో మంచి కషి చేసిందన్నారు. ఐసోలేషన్ కేంద్రం పెట్టడం, ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు వారి బంధువులకు భోజనాలు ఏర్పాటు చేయడం, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లకు కావలసిన ఆరోగ్య సలహాలను ఇచ్చిందన్నారు. ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ద్వారా ఆక్సిజన్ అందించే విధంగా కషి చేయడాన్ని అభినందించారు. విజ్ఞాన కేంద్రం సభ్యులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ద్వారా కంప్యూటర్ కోచింగ్, టైలరింగ్, కరాటే శిక్షణ, ఉద్యోగ నోటిఫికేషన్లకు ఉచిత కోచింగ్ తోపాటు గ్రంథాలయ నిర్వహణతో పాటు షుగర్,బీపీ, ఫిట్స్ పక్షవాతం రోగులకు ప్రతినెల మూడో ఆదివారం మందులు ఇస్తున్నామని తెలిపారు. ఇవే కాకుండా జనవరి మాసంలో గ్రామీణ క్రీడ పోటీలను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సాహవంతులైన క్రీడాకారులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఆదిరెడ్డి, జిల్లా జైలర్ జనార్దన్ రెడ్డి, ఆర్ఐ శ్రీనివాస్, పంతులు శ్రీనివాస్, పాలడుగు నాగార్జున, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.