Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కుడుదల నగేశ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షునిగా తను ఉన్నప్పుడు కొణిజేటి రోశయ్యతో కలిసి డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం కషి చేశామమని తెలిపారు. రోశయ్య అకాల మరణం తనను ఎంతో కలిచివేసిందని పేర్కొన్నారు. 1994 నుండి 1996 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడుమండలంలో కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరానికి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తల శిక్షణ శిబిరాన్ని , చారిత్రాత్మకమైన జైన దేవాలయం, సోమేశ్వరాలయంలను సందర్శించారని పేర్కొన్నారు.