Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురం
ప్రధానమంత్రి కార్మిక, కర్షక బీమా పథకం కింద మంజూరు చేసిన ఈ శ్రమ్ కార్డులను రామన్నపేట ఏఎల్వో శేష రత్నం ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేసే 54 రకాల కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఈకార్డులను అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు కొంగరి మారయ్య, ప్రధాన కార్యదర్శి నెల్లికంటీ జంగయ్య,నాయకులు కడతాళ శంకరయ్య, దోసర్ల ఆంజనేయులు, కంచర్ల నరసింహ,రాచకొండ చిన్న నర్సింహా తదితరులు పాల్గొన్నారు.