Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడా కారుడు కోచ్ పుల్లెల గోపీచంద్
నవతెలంగాణ-కోదాడరూరల్
దేశంలో ప్రతిభగల క్రీడాకారులకు కొదువ లేదని బ్యాడ్మింటన్ అంతర్జాతీయ క్రీడాకారుడు కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.ఆదివారం పట్టణంలోని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు తోటరంగారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత మూడు ఒలంపిక్స్పోటీల్లో భారతదేశానికి పతకాలు రావడం శుభపరిణామ మన్నారు.రాబోయే రెండునెలల్లో రాష్ట్రంలో పెద్దస్థాయిలో టోర్నమెంట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారులర్యాంకింగ్ మెరుగవుతుందని తద్వారా అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగే అవకాశం ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పిట్ఇండియా వంటి స్కీంల ద్వారా క్రీడారంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తగిన ప్రోత్సాహకం అందించిం దన్నారు.ఎక్కడైనా ప్రతి పిల్లవాడు ఆడుకోవడానికి మైదానం ఉంటే చాలని మైదానాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు.కోదాడలో గల ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉన్నతమైన ప్రమాణాలతో ఉన్నదని క్రీడాకారులు క్రీడాభి వద్ధితో పాటు ఆరోగ్యాలను కాపాడు కుంటున్నారని కొనియాడారు. ఒలంఫిక్స్ విజేత పీవీ సింధుకు ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు.జరగబోయే ఒలంపిక్స్‌లో కూడా రాణించి దేశానికి వన్నె తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణస్థాయి నుండి కూడా బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభను మెరుగు పరుచు కునేందుకు జిల్లా స్థాయిలో బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం తోటా రంగారావు మాతమూర్తి సంతాపసభలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఆమె మతి చాలా బాధాకరం అని ఆమె కుమారుడు తోట రంగారావును పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌చైర్మెన్ ఆవులరామారావు, మాజీ సర్పంచ్ పారసీతయ్య, జేఏసీ నాయకులు బంగారునాగమణి, వేముల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ బుడిగం నరేష్, కోట శ్రీనివాస్, జుట్టుకొండ బసవయ్య, జీవిరాజు పాల్గొన్నారు.