Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జునసాగర్‌లో మళ్ళీ వెలుగుచూసిన శిలాయుగపు అవశేషాలు
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఆదిమానవుని అడుగుజాడలకు నెలవైన నాగార్జునసాగర్ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్లు మరోసారి బయటపడ్డాయని పురావస్తు పరిశోధకులు, బుద్ధవనం బౌద్ధ నిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.తెలంగాణ పర్యాటక అభివద్ధి సంస్థ నాగార్జునసాగర్‌లో అభివద్ధిపరిచిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బుద్ధవనం పరిసరాలలో వాకింగ్‌ట్రాక్‌ను పరిశీలిస్తుండగా కష్ణాతీరంలో నాలుగు చోట్ల, మధ్య రాతియుగపు సూక్ష్మ రాతి పనిముట్లు, కొత్త రాతియుగపు గొడ్డళ్లు , సానదీసిన గుంటలు, ఒడిష రాళ్లు అరగదీసిన ఆనవాళ్లు వెలుగు చూశానని శివనాగిరెడ్డి తెలిపారు.అనంతరం మాట్లా డుతూ..గతంలో నాగార్జున కొండ పరిసరాలలో రాతియుగపు ఆనవాళ్ల బయల్పడిన యన్నారు.ఈ కొత్త ఆనవాళ్లు ఈ ప్రాంతం ఆదిమానవులు కార్యస్థావరంగా ఉండేదని నదితీరాన దగ్గరగా వేటకు వెళ్లి ఆహారసంపాదనకు అనువుగా ఉండేదన్నారు.కొత్త రాతియుగపు ఆనవాళ్లు ఉన్న వాకింగ్‌ట్రాక్ పైన ఆర్కలాజికల్ టూరిజాన్ని కూడా అభివద్ధి చేయవచ్చని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డి సూదన్‌రెడ్డి, బుద్ధవనం ఎస్ఈ క్రాంతిబాబు, బుద్ధవనం డిజైన్ ఇన్చార్జి శ్యామ్‌సుందర్‌రావు, నర్సింహారావు పాల్గొన్నారు.