Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో ఎటువంటి సంఘటనలు,ఎలాంటి గ్రూప్స్ తయారవుతున్నాయని, ముందస్తుగా గుర్తించడమే స్పెషల్ బ్రాంచి ముఖ్యవిధి అని ఎస్పీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.సమాజానికి భంగం కలిగేంచే అంశాలు, ప్రముఖుల రక్షణ, ప్రజల రక్షణ శాఖ ముఖ్య విధి అని తేల్చి చెప్పారు.అసాంఘీక కార్యకలాపాలు,అక్రమవ్యాపారాలు,అక్రమరవాణా వంటి పూర్తి సమాచారం సేకరించి జిల్లా పోలీసును అప్రమత్తం చేయడంలో జిల్లా స్పెషల్ బ్రాంచి క్షేత్ర స్థాయి అధికారులది ప్రథమ పాత్ర అని ఎస్పీ సూచించారు.ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా స్పెషల్ బ్రాంచి సిబ్బందితో జరిగిన సమావేశంలో శాఖ అధికారులు, సిబ్బందికి పలుసూచనలు, సలహాలు అందించారు. క్షేత్రస్థాయిలో తీవ్రమైననేరాలు, వ్యవస్థీకృత నేరాలు,ఆర్థికపరమైన నేరాలు, అక్రమవ్యాపారాలు జరగకుండా ముందస్తుగా ఇంటలిజెన్స్ సేకరించి అలాంటివి సంభవించకుండా చూడాలన్నారు. సమాచార వనరులు పెంచుకోవాలని, రాష్ట్ర, జాతీయరహదారులపై నేరాలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత శాఖపై ఉందని స్పష్టం చేశారు.పోలీసు సిబ్బంది పనితీరుపై నిఘా ఉంచాలన్నారు.సమాజంలో యాంటీ పోలీసింగ్‌ను గుర్తించాలన్నారు.పోలీసు ఇమేజ్ పెరిగేవిధంగా పని చేయాలన్నారు. టీమ్ వర్క్ చేయాలని సూచించారు. డిజిపి ప్రవేశపెట్టిన ప్రతి టెక్నాలజీ మాడ్యూల్ ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పౌరులకు సేవలందించే విషయంలో పోలీసును అప్రమత్తం చేయాల న్నారు.ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై నవీన్, క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు.