Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
పట్టణంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి రవికుమార్ తన తల్లి ్లసావిత్రమ్మ జ్ఞాపకార్థంగా తన సొంత నిధులతో మంచి నీటి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి 35వ వార్డు కౌన్సిలర్ తంగళ్లపల్లి శ్రీనవాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తల్లి పేరు మీద వాటర్ ట్యాంక్ నిర్మించడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాటూరి కష్ణ,,బండి దానయ్య,మాటూరి వినోద్, దాసరగణేష్, ప్రభాకర్, ఎలిమినేటి కుమార్, శ్రీరాములు పాల్గొన్నారు.