Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ : ఆలేరు మున్సిపల్ అభివద్ధి విషయంలో పట్టించుకోని మున్సిపల్ చైర్మెన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిలర్ సంగుభూపతి సోమవారం జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ శ్రీని వాస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులపై విచారణ చేపట్టాలని ,మున్సిపాలిటీ ఏర్పడి రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ డంపింగ్ యార్డు నిర్మాణ పనులు చేపట్టక పోవడంపై ,హరితహారం ,పట్టణ ప్రగతి పై పనులు చేయకపోయినా పదేపదే చేసినట్లు బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేయడంపై విచారణ చేపట్టాలని కోరారు.12వార్డులలో మొరంపోయించినట్లుగా బిల్లులు పెట్టడంపై విచారణచేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.