Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ జిల్లా నాయకులు శనగాని రాంబాబుగౌడ్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ భానుపురి హోటల్‌ను ఆయన ప్రారం భించి మాట్లాడారు. వినియోగ దారులకు నాణ్యమైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంతుల యాదగిరి, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులుగౌడ్, బైరు దుర్గయ్యగౌడ్, కక్కిఱేని నాగయ్యగౌడ్, బైరు వెంకన్నగౌడ్, కక్కిరేణి సత్యనారాయణగౌడ్, కుమ్మరి కుంట్ల లింగయ్య, పల్స వెంకన్న, సైదులు, వెంకన్న, బొమ్మగాని శ్రీనివాస్, రాఘవరెడ్డి, రహీం, నిర్వాహకులు పాలకుర్తి మౌనికసైదులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.