Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
నిధులను మళ్లించి తెలంగాణ ప్రభుత్వం స్థానికసంస్థలను నిర్వీర్యం చేసిందని స్థానిక సంస్థల ఉమ్మడినల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య ఆరోపించారు.సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం లోకొచ్చిన ఏడేండ్ల నాటి నుండి స్థానికసంస్థలకు నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిధులు కేటాయిం చకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచులు, తమ ఆస్తులను తెగనమ్ముకుని అభివద్ధి పనులు చేసినా నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు.హుజూరాబాద, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కూడా అనేక హామీలిచ్చిన సీఎం కేసీఆర్ అమలుచేయడంలో విఫలమైందని ఆరోపించారు. మాయమాటలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఆ పార్టీ అభ్యర్థికి ఓటేసేందుకు సిద్ధంగా లేరన్నారు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు డబ్బు, మద్యం ఎరగా చూపి ప్రలోభాలకు గురి చేస్తుంద న్నారు.స్థానికసంస్థల హక్కులు నిధులకోసమే తాను పోటీలో ఉన్నట్టు తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కల్యాణి,కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు పల్లె వెంకన్న, పట్టణఅధ్యక్షులు దోటి వెంకటేష్, మంచుకొండ సంజరు పాల్గొన్నారు.