Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
గనుల పర్యావరణం, ఖనిజ సంరక్షణ వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మండలంలోని భవానీపురం డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్‌లో ఆ కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ (వర్క్స్) ఎన్.శ్రీనివాసరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలను ఈ నెల 12వ తేదీ నిర్వహించనున్నట్టు చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఖనిజ సంపదను సక్రమంగా వినియోగించుకొని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంలు నాగమల్లేశ్వర్రావు, ఎమ్‌డి.మస్తాన్, డీజీఎంలు డి.కల్యాణ్‌చక్రవర్తి, శ్రీనివాసరావు, ఏజీఎంలు పీవీ రమణారావు, కేవీఎల్ నర్సింహారావు, పి.నరసింహారెడ్డి, చీఫ్ మేనేజర్లు పీఏ సూర్యనారాయణ, నాగేంద్రుడు, ఎన్ఎస్.ప్రవీణ్‌కుమార్, మేనేజర్లు రమేష్, జీవీ.రమణ, సిబ్బంది పాల్గొన్నారు.