Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థినులు ఒత్తిడిని ఎదుర్కునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఎస్ఎస్పీ మేనేజింగ్ డైరెక్టర్, మనస్థత్వవికాస నిపుణులు సుమన్ బోక్రే అన్నారు.సోమవారం మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం 2021-22 ఫస్టియర్ బీటెక్ విద్యార్థినులకు అవగాహన, ప్రేరణ (ఓరియోంటేషన్, ఇండక్షన్ ప్రోగ్రాం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోధైర్యంతో ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించాలన్నారు.విద్యార్థి జీవితం ఆహ్లాదకరంగా, ఆనందంగా ముందుకు సాగాలని హితబోధ చేశారు.కళాశాల చైర్మన్ ఎండి.మహ్మద్‌అలీ మాట్లాడుతూ తల్లిదండ్రుల కలను సహకారం చేయాలన్నారు.కళాశాల డైరెక్టర్ షహలాబూతులు మాట్లాడుతూ మనోధైర్యాన్ని కోల్పోతున్నారన్నారు.ఈ సందర్భంగా సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహి ంచారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షాజీ, హెచ్‌అండ్‌ఎస్ విభాగాధిపతి వాణి, డాక్టర్ బడేసాహెబ్,రాయుడు, నాగరాజు, నాగరాజు, రామకష్ణారెడ్డి,వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.