Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
స్థానిక కోర్టు సూపరింటెండెంట్ రాధాకృష్ణ నల్లగొండ జిల్లా కోర్టుకు, మంగయ్య సూర్యాపేట పోక్సో కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ మాట్లాడుతూ రాధాకృష్ణ, మంగయ్యలు ఎక్కడ పని చేసినా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కుమారస్వామి, తాళ్లపళ్ళి సత్యనారాయణ, హరిచరన్, రణధీర్, పూల్సింగ్, ప్రతాప్, రవికుమార్, రాజారాం, సతీరష్, అనిల్ పాల్గొన్నారు.