Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
దళితుడైన రొయ్య శ్రీనును పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి కులం పేరుతో దూషిస్తూ కాలు విరగగొట్టిన పోలీసులను విధుల నుంచి తొలగించి వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలో విద్యార్థిసంఘాలు, ప్రజా సంఘాలు, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి వినతిపత్రం అందజేశారు.దేశంలో, రాష్ట్రంలో దళితులపై అనేక దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. మరియమ్మ ఘటన మరువక ముందే జిల్లాకేంద్రంలో ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు.శ్రీనివాస్‌కు న్యాయం జరగకపోతే మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు అంకెపాక శ్రీనివాస్, మహిళ కార్యదర్శి ఇంద్రవెల్లి కవిత, ఎరుకలసంఘం జిల్లా అధ్యక్షుడు మనుపాటి భిక్షం, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సందయాదగిరి, జిల్లా అధ్యక్షుడు రేఖలసైదులు, తలమల్ల యాదగిరి, దళిత సంఘం రాష్ట్ర నాయకులు చింతఎల్లయ్య, మామిడి వినోద్, గుడపూరి సంజరు, తెలంగాణ విద్యార్థి పోరుసు రాష్ట్ర నాయకులు కత్తులరవికుమార్, సురేష్, నరేష్, రవి,యేశంల్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.