Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
వెంటనే ఇండిస్టియల్ పార్క్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎలిమినేడు భూమి బాధితులు సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్‌ర్డీఓ కార్యాలయం ముందు వంటావార్పు నిర్వహించి ధర్నా చేశారు.అనంతరం అక్కడే భోజన వితరణ నిర్వహించారు.ఈ సందర్భంగా పీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి మాట్లాడుతూ పేదల అసైన్డ్ భూములను లాక్కొని హెటిరో అధినేత పార్థసారధిరెడ్డికి ప్రభుత్వం అంటగట్టే ప్రయత్నాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుని పేదకుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.ప్రభుత్వ భూములను లాక్కొని వారిని రోడ్డున పడేయడం బాధాకరమని అన్నారు. ఎలిమినేడు లో ఇండిస్టియల్ నిర్మించడంతో కాలుష్యపు కోరల్లో ప్రజలు నలుగుతు న్నారన్నారు.320 ఎకరాల్లో 200 మంది జీవనం కోల్పోతున్నారని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వినతిపత్రాన్ని ఆర్డిఓ జగదీశ్వర్‌రెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, సామరామ్రెడ్డి, కొరగోని రామచంద్రం, మెట్టు శ్రీశైలం, బుర్రవెంకటేష్, ఫకీర్, శ్రావణ్, మహిళలు పాల్గొన్నారు.