Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ప్రపంచ పర్యాటకకేంద్రంగా బుద్ధవనం రూపుదిద్దుకుంటుందని శాసన మండలి సభ్యులు, ప్రముఖ ప్రజాకవి గోరెటి వెంకన్న అన్నారు.ఆంధ్రా రాష్ట్రం నుండి వస్తూ నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనాన్ని సోమావారం సందర్శిం చారు.అనంతరం బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి బుద్ధవనంలో ఉన్న మహాచైత్యకుడ్యం, మ్యూజియంలో బుద్ధిని జీవిత చరిత్ర, శిల్పసంపదను పరిశీలిం చారు.కాసేపు అక్కడే ధ్యానంచేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సాగర్ జలాశయం మధ్యలో ఉన్న శ్రీపర్వతాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు.సాగర్‌లో బుద్ధవనం పనులు సీఎం కేసీఆర్ చొరవతో ప్రాజెక్ట్ అధికారిగా మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో చాలా సుందరంగా రూపుదిద్దు కుంటున్నాయన్నారు. పర్యాటకులు తప్పకుండా బుద్ధవనాన్ని తిలకించాలని కోరారు.సాగర్‌కు దగ్గరగా ఉన్న మనమే బుద్ధవనాన్ని పట్టించుకోవడంలేదని కానీ దేశ విదేశాల నుండి బుద్ధవనం సందర్శనకు పర్యాటకులు వస్తున్నారన్నారు.బుద్ధవనం ప్రపంచ పర్యాటకకేంద్రంగా రూపుదిద్దుకుందని, తీరికలేని జీవనంలో పిల్లలతో సహా బుద్ధవనాన్ని సందర్శిస్తే మనస్సుకు మానసికప్రశాంతత కలుగు తుందన్నారు.ఈ కార్యక్రమంలో బుద్ధవనం ప్రాజెక్ట్ అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు.