Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినరు కృష్ణారెడ్డి కోరారు. పట్టణంలోని వివిధ వార్డులో సాగుతున్న వ్యాక్సినేషన్ తీరును ఆయన సోమవారం పరిశీలించి మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసు కోవాలన్నారు. జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదని, ఇప్పటివరకు మొదటి డోస్ 6,64,109 మంది, రెండో డోస్ 3,07,214 మందికి ఇచ్చినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 250 మెడికల్ టీమ్స్ పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.