Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ : షార్ట్ సర్క్యూట్‌తో పత్తిలోడ్కు తటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీలో చోటుచేసుకుంది. మంగళవారం వామపక్షాలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయా లని ఎస్ఎల్బీసీ ఐకేపీ వద్ద రోడ్డుపై నిరసన తెలుపుతున్న సమయంలో హాలియా నుండి పత్తిలోడుతో చిట్యాలకు వెళ్తున్న డీసీఎం అడ్డదారిలో వెళ్తుండగా విద్యుత్ వైర్ తెగి ఆ మెరుగులు డీసీఎంలో ఉన్న పత్తిపై పడ్డాయి.దీంతో వెంటనే పత్తి అంటుకుంది.ఇది గమనించిన వన్‌టౌన్ సీఐ వి.బాలగోపాల్ తన సిబ్బందితో డీసీఎం వెనుకవైపు నుండి వెంబడించి ఆపి పక్కనే ఉన్న వాటర్‌తో మంటలను ఆర్పేశారు.దీంతో పోలీసులు తుటిలో ప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు.