Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జునసాగర్ :కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని విజయపురి టౌన్ ఎస్.ఐ నర్సింహారావు తెలిపారు.నాగార్జునసాగర్ పైలాన్ కాలనిలో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న స్థానికులకు హెచ్చరించడం జరిగింది.అనంతరం మాట్లాడుతూ..పబ్లిక్ ప్లేస్‌లలో, పనిచేసే స్థలాలలో, శుభకార్యాలలో , జన సమూహంగా ఏర్పడే ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలిపారు.కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.మాస్కులు ధరించని వారిపై రూ,1,000 జరిమానా విధించబడుతుందని తెలిపారు.