Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిడమనూరు
రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర నాయకులు మువ్వఅరుణ్ కుమార్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో దాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అనంతరం తహసీల్దార్ హెచ్. ప్రమీలకు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఐకేపీ కేంద్రాల్లో గాన్ని బ్యాగుల కొరతతో కొనుగోళ్లు నెమ్మదించాయని అధికారులు దష్టి సారించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. మిర్యాలగూడల శాసన సభ్యులు భాస్కర్రావు అక్కడి నియోజకవర్గ రైతులకు దాన్యం పంటపై భరోసా కల్పిస్తూ వరి సాగుచేసుకోవాలని ఇప్పటికే అనేక పర్యాయాలు రైతులకు చెప్పారన్నారు.అలాగే సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కూడా నియోజకవర్గ రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు బలరాంరెడ్డి,చాంగం లింగారెడ్డి, మంద తిరుపతయ్య, కంచర్ల వెంకన్న, రామస్వామి, వెంకన్న, దాసరిసైదులు, రామాంజిరెడ్డి పాల్గొన్నారు.