Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ ఖిల్లాను పర్యాటకంగా అభివద్ధికి కషి చేస్తానని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.....దేవరకొండ ఖిల్లా దుర్గం భారతదేశంలోనే అతి ప్రాచినమైనది,అత్యంత ప్రాధాన్యత కల్గింది అని ఆయన గుర్తు చేశారు.రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కషి చేస్తున్నారన్నారు. పర్యాటక ప్రదేశాలను అభివద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దేవరకొండ ఖిల్లాను పర్యటక కేంద్రంగా ఏర్పాటుకు కషి చేస్తానని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి ఖిల్లాను పర్యటన కేంద్రంగా ఏర్పాటుకు కావలిసిన నిధులు మంజూరు చేహించి రాష్ట్రంలో నెంబర్ వన్ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని తెలిపారు.ఖిల్లాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్లు మంజూరు కావడం జరిగింది అని ,ఖిల్లా ఆవరణలో 7ఎకరాల్లో పార్కును ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు.ఇప్పటికే ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేయడం జరిగింది అని, రూ. కోటితో సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. ఖిల్లా ఆవరణలో రూ.20లక్షలతో మిషన్ కాకతీయ ద్వార కుంటలో పూడిక తీయడం జరిగింది అని ఆయన అన్నారు. ఈనెల 11వ తేదీన సాయంత్రం 4గంటలకు రవీంద్రభారతిలో వంద సంవత్సరాల క్రితం దేవరకొండ ప్రజల జీవన విధానం దేవరకొండ ఖిల్లా దుర్గం ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది అని ఆయన తెలిపారు.ఈ ఫొటో ఎక్సగిబిషన్ 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు కొనసాగుతుంది అని ఆయన అన్నారు. ఎగ్జిబిషన్ కు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, భాషా సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ హాజరుకానున్నారు అని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు దేవరకొండ ఖిల్లా దుర్గం అభిమానులు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన కోరారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ పోస్టర్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ,ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి,జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్,రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు,వైస్ చైర్మన్ రహత్ అలీ,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్,మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్,బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,వేముల రాజు,బొడ్డుపల్లి కష్ణ,పొన్నబోయిన సైదులు,మహమ్మద్ రైస్, మూడవత్ జయప్రకాష్ నారాయణ, కుంభం శ్రీశైలం గౌడ్, తౌఫిక్ ఖాద్రీ, చిత్రం ప్రదీప్, ఇలియస్, పగిడిమర్రి రఘురాములు, సత్తార్, ఫరాన్,తదితరులు పాల్గొన్నారు.