Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
కస్తూరిఫౌండేషన్ సేవలు అభినందనీమని నేర్మట నందికొండ నర్సింహారెడ్డి,ఎంఈఓ గుర్వారావు అన్నారు.కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ సహకారంతో మంగళవారం గ్రామ పంచాయితీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల మరమత్తుల పనులను గ్రామ సర్పంచ్ పనులు ప్రారంభిం చారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించి బలోపేతానికి కషి చేస్తు, గ్రామాల్లోని చిన్నారులు విద్యకు దూరం కావొద్దునే ఉద్దేశంతో ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రధానోపాధ్యాయులు మధు మోహాన్,ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయులు లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి రవి కుమార్, నందికొండ వినరు రెడ్డి,మహేష్,మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.