Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతులకు ఇబ్బందులు కలగొద్దు
రైతులందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చైతన్య పరచాలి
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
నవతెలంగాణ-నల్లగొండ
వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం మండలం లోని కేశరాజుపల్లి, దండెంపల్లి, అడవిదుప్పలపలి ,ఎల్లారెడ్డిగూడెం, ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాలను పరిశీలించి మాట్లా డారు.జిల్లాలో రైతులు వానాకాలం పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేయడానికి వీలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైనన్ని తూకపు మిషన్లు, తేమ యంత్రాలు, గోనె సంచులు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు.కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న రైతులు మాత్రమే కేంద్రాలకు వచ్చేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్రావు, సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం పాల్గొన్నారు.