Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యేకు సంబంధం లేదు
నవతెలంగాణ-నార్కట్పల్లి
అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అధికారులు చర్యల్లో భాగంగా నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి సస్పెండ్ అయిన ఘటనలో ఎమ్మెల్యే చిరుమర్తిలింగయ్యకు సంబంధం లేదని టీిఆర్ఎస్ మండల కార్యదర్శి మేడబోయిన శ్రీనివాస్, చిన్ననారాయణపురం సర్పంచ్ కొత్తనర్సింహ, యాదవ సంఘం నాయకులు దుబ్బాక శ్రీధర్, చెర్వుగట్టు దేవస్థానం డైరెక్టర్ దేవేందర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానికంగా వారు మాట్లాడుతూ కొన్నిరోజులుగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై యాదవుల సంఘాల పేరుతో సామాజిక మాద్యమాలలో అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అధికారుల చర్యల్లో భాగంగా సస్పెండ్ అయిన నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అవినీతిపరులతో సామాజిక మాద్యమాల్లో ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ సమావేశంలో నాయకులు జనిగేనాగరాజు, బొబ్బలి శ్రవణ్, నడింపల్లి నరేష్ పాల్గొన్నారు.