Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎంహెచ్ఓ కొండల్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ కొండల్రావు ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ డివిజన్పరిధిలో గల అన్ని పట్టణ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల సిబ్బందితో ఐఎంఐ భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో, మొదటిడోసులు 100 శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మిగిలిన డోసుల వారు వేయించుకొని వారిని గుర్తించి ముందస్తు ప్రణాళికను తయారు చేయాలన్నారు.పట్టణ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధి కారులను, సూపర్వైసర్, సిబ్బందిని, క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రణాళిక ప్రకారం రివ్యూ చేశారు.ఈ కార్యక్రమములో డాక్టర్ రామ్మోహన్ రావు,జిల్లా టీకాల నియంత్రణ అధికారి,ఆఫీస్ సిబ్బంది ఎం.వెంకటయ్య, ఎస్.శ్రీనివాస స్వామి, వి.వాసుదేవరెడ్డి, డాక్టర్ ఉపేందర్ పాల్గొన్నారు.