Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టి పెట్టేందుకే డ్రామా
ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-నల్లగొండ
ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రైతులతో ఆటలాడుతూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని, కోట్లమంది ఆధారపడిన వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే డ్రామా లాడుతున్నాయని అఖిలపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.మంగళవారం జిలా ్లకేంద్రంలోని ఎస్సెల్బీసీ ధాన్యం కొనుగోలుకేంద్రం వద్ద అఖిలపక్షం,ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లాకార్యదర్శి నెల్లికంటి సత్యం, తెలంగాణఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకుసుధాకర్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్వీ.యాదవ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున,తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు మాట్లాడారు.ధాన్యం కొనుగోలులో వేగం పెంచి, తరుగుపేరుతో జరుగుతున్న అక్రమాలు ఆపాలని డిమాండ్ చేశారు.చౌడు భూముల్లో వరి సాగు చేయకపోతే రైతులు ఏం సాగు చేస్తారని ప్రశ్నించారు.వరి వేయొద్దంటే ప్రత్యామ్నాయం ఏంటో రైతుల వద్దకు వచ్చి సీఎం కేసీఆర్ పరిష్కారం చూపించాలని కోరారు.ఆయకట్టు ప్రాంతంలో వరివేయకుంటే ఏమి వేస్తారో స్పష్టం చేయాలన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించే సందర్భంలో కోటి ఎకరాల్లో లక్షలటన్నుల ధాన్యం పండించాలన్న నీటి మాటలు ఇవాళ ఏమైనవని ప్రశ్నించారు.ఏయే పంటకు ఎంతమద్దతు ధర కల్పిస్తారో క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.బీజేపీ, టీఆర్ఎస్ రైతుల విషయంలో మూర్ఖంగా వ్యవహరిస్తున్నాయన్నారు.రైతాంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఇప్పటికే కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందుతున్న రైతులకు వర్షభయం పట్టుకుందని, కోతలు కోసి రాసులు పోసిన పంటను ఎలా కాపాడుకోవాలోనని ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి గింజను కొనుగోలు చేసి చిత్తశుద్ధి నిరుపించుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్రం మాత్రం ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్‌లో పండిన వరిధాన్యాన్ని మాత్రం వేగంగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంధన్నారు.ఇది తెలంగాణ పట్ల వివక్ష కాదా అని ప్రశ్నించారు.కార్పొరేట్ల కోసం మోదీ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే ఏడాది కాలంగా నోరు మెదపని కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.750 మంది రైతులు ఆయాచట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయినా స్పందించని కేసీఆర్‌కు ఇప్పుడు సాగుచట్టాలు గుర్తుకొచ్చాయా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండిశీశైలం, పాలడుగు ప్రభావతి, సయ్యద్ హాషం, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు దండెంపల్లి సత్తయ్య, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, కూరెళ్లవిజరుకుమార్, కుంభం కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, కొండేటి మురళి , వీరునాయక్, చందన్, దినేష్, పబ్బు వీరస్వామి, బొల్గూరి నర్సింహ్మ, తుమ్మల పద్మ, కొండా అనురాధ,భూతం అరుణ,ఉమారాణి, మంజుల, కొండా వెంకన్న, కందుల సైదులు పాల్గొన్నారు.